Entertainment

రివ్యూ: ఖైదీ నెంబరు 150 -అభిమానులకు చిరంజీవి ఇచ్చిన కానుక

విడుదల తేది: 11-01-2017

యువ సర్కిల్.కామ్ రేటింగ్ :౩.25/5

దర్శకత్వం:వి.వి .వినాయక్

నిర్మాత :రామ్ చరణ్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

నటీనటులు:చిరంజీవి,కాజల్ అగర్వాల్

తెలుగు సినీ ప్రేక్షకులు .మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా “ఖైదీ నెం 150” మెగా స్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా కావడం ,ఆయనకిది 150 వ సినిమా కావడం వంటి కారణాలతో ఖైదీ పై అభిమానుల్లో భారీ  అంచనాలు నెలకొన్నాయి.మరి ఇన్ని అంచనాలు నడుమ నేడే థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం  ఎలా ఉంది? అభిమానులను .ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించింది? చూద్దాం.

కథ:

తెలివిగా జైలు నుండి తప్పించుకున్న “ఖైదీ నెం 150” కత్తి శీను (చిరంజీవి) ఎలాగైనా బ్యాంకాక్ వెళ్ళిపోవాలని ట్రై చేస్తుండగా అనుకోకుండా ఒక ప్రమాదంలో అతను శంకర్(చిరంజీవి) అనే వ్యక్తి ని కాపాడాల్సి వచ్చి ,అతడ్ని పోలీసులకి పట్టుబడేలా చేసి అతని స్థానం లోకి వెళ్ళిపోయి డబ్బు సంపాదించాలను కుంటాడు.

కానీ శంకర్ జీవితo మీద ఒక ఊరి రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి అని తరువాత తెలుసుకున్న కత్తి శీను షాక్ కి గురవుతాడు. అలా శంకర్ జీవితం గురించి తెలుసుకున్న శీను ఎలాంటి కీలక నిర్ణయం తీసుకున్నాడు.? ఏం చేశాడు? ఆసలు శంకర్ గతం ఏమిటి ? శంకర్ ని నమ్ముకున్న రైతుల సమస్యలు  ఏమయ్యాయి ? శీను వల్ల జైలుకు వెళ్ళిన శంకర్ పరిస్తితేంటి ?అనేదే ఈ సినిమా కథ….

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ అంటే మెగా స్టార్ చిరంజీవి .9 ఏళ్ల తరువాత స్క్రీన్ మీద అన్నయ్య ఫుల్ లెంగ్త్ హీరోగా చూడటం అభిమానులకు పండగే అని చెప్పాలి. చిరంజీవి కూడా బాగా వర్కవైట్స్ చేసి యంగ్ గా కనువిందు చేశారు. ఎమోషనల్ సన్నివేశాలలో ఆయన అసామాన్యంమైన నటన, డైలాగులు ,ఫైట్స్ బాగున్నాయి.ముఖ్యంగా ప్రతీ పాటలోనూ చిరంజీవి వేసినసూపర్ స్టెప్పులుప్రేక్షకుల ఉత్సాహన్ని తారా స్థాయికి తీసుకెళ్ళేలా ఉన్నాయి.

రీమేక్ కథే అయినప్పటికీ ఒరిజినల్ వర్షన్ ను చిరంజీవి తగ్గటుగా మలచడంలోనే  ఈ సినిమా సక్సెస్ అయిoదని చెప్పుకోవచ్చు.ఒరిజినల్ చేసిన వారికేనా చుడనివారికైన సినిమా ఒకే ఫీలింగ్ కల్పించేలా ఉండడం కూడా చిరు ప్రేజన్స్ వల్లే సాధ్యమైంది . ముఖ్యంగా ఆయన తన దైన టైమింగ్ తో చేసిన కామెడీ  కట్టిపడేసేలా ఉంది. తన రోల్ కు మరి ఎక్కువ ప్రాధాన్యత లేకున్నా ,ఉన్నంతలో కాజల్ ఎప్పటిలానే తన అందం తో ,నటన తో బాగా ఆకట్టుకుంది .

ఫస్ట్ ఆఫ్ అంతా చిరు ఎనర్జీటిక్ డైలాగ్స్ , యాక్టింగ్ తో సరదాగా నడుస్తూనే మరో వైపు కథలో ముఖ్యమైన రైతుల సమస్యలను ఎలివేట్ చేయడంలో అద్భుతంగా తయారైంది .ఇక పాటలన్నీ  మంచి ఊపుతెచ్చేవే కాకుండా, వాటిని అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించడం, చిరు డాన్స్ లా అదిరిపోయేలా ఉండడంతో అభిమానులకు కనులవిందు చేశాయి. ముఖ్యంగా అమ్మాడు లెట్స్ డు కుమ్ముడు పాటలో చరణ్ చిరంజీవి తో కలిసి వేసిన స్టెప్పులు అభిమానులకు పెద్ద గిఫ్ట్ అనే చెప్పాచ్చు.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయానికి కోస్తే ప్రధానంగా కనిపించేది బలంనేని ప్రతీ నాయకుడి పాత్ర అనే చెప్పాలి. చిరంజీవి అంతటి స్టార్ హీరో కి ఇమేజ్ ని సినిమాలో మోయాలంటే అంతే బలమైన ప్రతీ నాయకుడు అవసరం .ఆద్యంత హీరోతో పోటీపడుతూ హీరో పాత్ర బలంగా మరేలా చేయాలి. కానీ ఇందులో విలన్ పాత్ర అలా చేయలేదు. చిరంజీవి ముందు చాలా వరకు చిన్నబోయింది.దీంతో సినిమాని చాలా వరకు చిరంజీవి వైపు నుండే  చూడాల్సి వచ్చింది. ఆ పాత్ర లో నటించిన తరుణ్ అరోరా నటన కూడా చెప్పుకోదగినస్థాయిలో లేదు. పైగా ఆయన చెప్పిన డబ్బింగ్ చూస్తే హిందీ సినిమా చూసినట్టు తోచింది.

ఇక ఫస్టాఫ్ రైతుల సమస్యను ఎలివేట్ చేసినంత బలంగా సేకండప్లో అయితే బలంగా దీనికి పరిష్కారం చూపడంలో విఫలం అయ్యారు. సెకందాఫ్లో డ్రామా కాస్త ఎక్కువయిపోయి ఫస్టాఫ్ ఇచ్చేంత ఎంజాయ్ మెంట్ ఇవ్వలేకపోయింది.ఇక క్లైమాక్స్ అయితే మరి సాగాదియడంతో పాటు , చిరు 150 సినిమా అంటే , ఆ స్థాయిలో లేకుండా సాగదీసేలాగా ఉంది. ఇక కథ ముందే తెలిసిపోయేంత ప్లేన్ గా ఉండడం కూడా ఒక మైనస్.

సాంకేతిక విభాగం:

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా వివి వినాయక్ తనపై మోపిన పెద్ద అతిపెద్ద బాద్యతను సమర్దవంతంగానే పోషించాడని చెప్పాలి. మురుగదాస్ కథను చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా మర్చి , అభిమానులు ఏయే అంశాలను కోరుకుంటారో అవన్నీ ఉండేలా చూసుకుంటూ కథలోని ఎమోషన్ దెబ్బ తినకుండా వినాయక్ చూపిన ప్రతిభ మెచ్చుకోదగ్గది. దర్శకుడిగా ఒక ఫర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాను అందించడంలో విజయం సాధించాడు. ఇకపోతే సెకండాఫ్ విషయంలో , ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే, సినిమా రేంజ్ వేరేలా ఉండేది.

దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలన్నీ ఇప్పటికే సూపర్ హిట్. విజువల్స్ పరంగా చూపించినప్పుడు ఆ పాట స్థాయి మరింత పెరిగినట్లనిపించింది. కొరియోగ్రాఫర్లు లారెన్స్ ,జానీ మాస్టర్లు చిరంజీవి చేత వేయించిన స్టెప్పులు సినిమాకే మేజర్ హైలెట్ గా నిలిచాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ కీలక సన్నివేశాలన్నిటిలో దేవిశ్రీ పనితనం చూడచ్చు. ఇక రత్నవేణు సినిమాటోగ్రఫీ సినిమాకో స్థాయిని తీసుకొచ్చింది . సాయి మాధవ్ బుర్ర రాసిన సంభాషణలు చాలా వరకు బలంగా తాకేలా , చిరు ఇమేజ్ కు తగ్గట్టు చాలా బాగున్నాయ్. ఎడిటింగ్ బాగుంది. రామ్ చరణ్ పాటించిన నిర్మాణ విలువలు చాలా గొప్పగా  ఉన్నాయి.

తీర్పు:

భారీ అంచనాల మధ్య విడుదలయిన మెగాస్టార్ 15౦వ చిత్రం అభిమానులను చాలా బాగా మెప్పించింది. అద్భుతమైన ఫస్టాఫ్ , అందులో బలంగా ఎలివేట్ చేయబడ్డ రైతు సమస్య, చిరంజీవి స్క్రీన్ ప్రెజన్స్ , అదిరిపోయే స్టెప్పులు ఆలస్యమైన అయన నటన , టైమింగ్ తో కూడిన మంచి కామెడి ఇందులో ప్రధాన ప్లస్ పాయింట్స్ కాగా ఏ మాత్రం సినిమాను ప్రభావితం చేయలేకపోయిన బలహీనమైన ప్రతినాయకుడి పాత్ర , సెకండప్లో కాస్త సాగదీసిన డ్రామా , రైతులు సమస్యలకు బలమైన పరిష్కారం చూపకుండా అసంతృప్తిగా వదిలేయడం వంటివి ఇందులో మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే మంచి మెసేజ్ తో వచ్చిన చిరంజీవి రీ ఎంట్రీ బాస్ ఇజ్ బ్యాక్ అనేలా ఉంది.

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top