Tech

భయపెడుతున్న నెంబర్ 777888999…భయటపడ్డ రహస్యం….

భయపెడుతున్న నెంబర్ 777888999…

భయటపడ్డ రహస్యం….

వట్సాప్ యూజర్లకు విజ్ఞప్తి..!దయచేసి ఈ మెసేజ్ ని జాగ్రతగా చదవండి. రాత్రి 12 గంటల నుంచి ౩ గంటల లోపు మీకు 777888999 అనే నంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి. ఇది తొమ్మిది అంకెల నంబర్. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టి పారేయకండి… ఇప్పటికే ఈ కాల్ లిఫ్ట్ చేసి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్ లిఫ్ట్ చేస్తే ఒక అమ్మాయి మాట్లాడుతుంది… ఇదిమీకు లాస్ట్ కాల్ అనిచెపుతుంది. ఈ కాల్ ద్వారా వైరస్ వస్తుంది. వెంటనే మీ ఫోన్ పేలిపోయి మీరు చనిపోతారు. దయ చేసి ఈ విషయాన్నీ అందరికి షేర్ చేయండి.

ఇందులో నిజమెంతుందో..ఇప్పుడే తెలుసుకోండి..!! ఈ కాలంలో నిజాల కన్నా… ఎక్కువగా నమ్ముతున్నారు ప్రజలు . ఇక స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ వచ్చిన తరువాత ఇలాంటి వార్తలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్ , వాట్సప్ లాంటి సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలు తెగ హడావుడి చేస్తున్నాయి. నిజానికి పైన చెప్పిన మెస్సేజ్ అక్షరాల ఫేక్ . కనడ న్యూస్ ఛానల్ టిఅర్పీ ల కోసం చేసిన ఒక చీప్ ట్రిక్. ఈ విషయాన్నీ చాలా మంది నమ్మి మోసపోతున్నారు. ఇందులో మీరు కూడా ఉండే ఉంటారు. మనతో పాటు మన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సురక్షితంగా ఉండాలని ఇలాంటి మేస్సేజస్ నిజమైనా , అబద్దమైనా వెంటనే ఫార్వర్డ్ చేస్తుంటాం. కానీ ఈ మెస్సేజ్ మాత్రం ఫేక్ అని తేలిపోయింది.

లేటెస్ట్ టెక్నాలజీ పై పట్టు ఉన్న మన టీం మెంబర్స్ ఈ విషయం పై పరిశోదన చేశారు. ఇందులో నిజం లేదని…అసలు ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు జరగలేదని….ఇక మీదట కూడా జరగబోవని తేల్చి చెప్పారు. బహిరంగ ప్రదేశాలలో మెరుపులు వచినప్పుడు లేదా చార్జింగ్ పెట్టి స్మార్ట్ ఫోన్ లో మాట్లాడుతున్నపుడు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కానీ ఇలా ఒక ఫోన్ కాల్ ద్వారా మనిషి చనిపోవడం లేదా వైరస్ వ్యాపింపచేయడం జరగని పనులు  అని పరిశోధకులు స్పష్టం చేశారు.

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top