News

గ్రూప్ 2 రాయబోతున్న వారికోసం ప్రత్యేకం

గ్రూప్ 2 రాయబోతున్న వారికోసం ప్రత్యేకం

తెలంగాణా యువత ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 2 పరీక్ష ఈ నెల 11, 13వ తేదీన జరగబోతున్నాయి.ఆ పరీక్షలకు

భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పారదర్శకంగా నిర్వహించేందుకు పలు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఎవరైతే ఈ పరీక్ష రాయబోతున్నారో వారు ఈ కింద సూచించిన విషయాలు తప్పకుండా పాటించాలని అధికారులు పేర్కొనారు.

అభ్యర్ధులు బూట్లు ధరించి రాకూడదు. ఎలాంటి నగలు, చేవిపోగులు , చేతి గడియారాలను అనుమతించరు.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, లాగరిథమ్స్ టేబుల్స్ , చేతి బ్యాగులు , పర్సులు , పుస్తకాలు వంటి వాటిపై నిషేధం ఉంటుంది.

చేతి వేళ్ళపై గోరింటాకు ఉండకూడదు.ఇంక్ మరకలున్నా అనుమతించరు.

అందరు అభ్యర్ధులు విధిగా హాల్ టికెట్ తోపాటు మరో ఫోటో గుర్తింపు కార్డు తేవాలి.

హాల్ టికెట్ పై ఫోటో సరిగా లేని అభ్యర్ధులు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తేవాలి.

పరీక్ష జరిగే నాడు ఉదయం 9:45 గంటల తరువాత , మధ్యాహ్నం 2:15 గంటల తర్వాత అభ్యర్ధులను కేంద్రాల్లోకి అనుమతించరు.

తనికీ ప్రక్రియలో భాగంగా అభ్యర్ధుల వేలిముద్ర , ఫోటో తీసుకుంటారు.ఓఎంఆర్ పత్రాన్ని నీలం లేదా నలుపు రంగు బాల్ పాయింట్ పెన్నుతోనే నింపాల్సి ఉంటుంది.

పెన్సిల్ , ఇంక్ పెన్ ,జెల్ పెన్ వై=తో రాసిన పత్రాలను పరిశీలించరు.

ఒరిజినల్ ఓఎంఆర్ పత్రంతో బయటకు వెళితే ,ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top