Entertainment

హైపర్ ఆదికి బంపర్ ఆఫర్ ఇచ్చిన త్రివిక్రమ్

జబర్దస్త్ లో సాదారణ టీం మెంబర్ గా వచ్చిన ఆది అతి తక్కువ

సమయంలోనే టీం లీడర్ గా ఎదిగి తన స్కిట్ లతో ఆదరగొడుతున్నాడు.

 హైపర్ ఆదిగా మారి తన పంచ్ లతో నవ్వులు పూయిస్తున్నాడు.

అది స్కిట్ లకు యు ట్యూబ్ లో కూడా వ్యూస్ అధికంగా వస్తున్నాయి.

అభిమానులు కూడా అది సీట్ల కోసంఎదురుచుస్తున్నారంటే అతిశయోక్తి

లేదు. తాజాగా అది మరో సువర్ణావకాశాన్ని చేజిక్కించుకున్నాడు. మాటల

మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి పిలుపు అందుకున్నాడు. తన టీం లో చేరమని ఆదికి త్రివిక్రమ్

ఆహ్వానం పంపినట్లు తెలిసింది. స్కిట్ లను అద్భుతంగా రాసి , మంచి టైమింగ్ తో డైలాగులు చెబుతుండటంతో

ఈ ఆఫర్ ఇచినట్లు సమాచారం.

బీటెక్ చదివినా సినిమాల్లోకి వెళ్ళాలనే ఆశతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్ కి వచ్చాడు. ఇన్నాళ్ళకి తన కల

నేరవేరుతుండడంతో ఆది సంబరపడిపోతున్నాడు. త్రివిక్రమ్ ప్రస్తుతం చేయనున్న పవన్ కళ్యాణ్, ఎన్టీ ఆర్, మహేష్ బాబు

సినిమా స్క్రిప్ట్ వర్క్ లో రచయితగా ఆది భాగం పంచుకోనున్నాడు. తెరపైన కూడా కనిపిస్తాడా? అనే విషయంపై  ఇంకా క్లారిటీ

రాలేదు. త్రివిక్రమ్ ఆ అవకాశం కూడా ఇచ్చిన ఆశ్చర్యపోవనవసరం లేదని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు.

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top