Entertainment

వ్యభిచార గృహం నడుపుతున్న ప్రముఖ హీరోయిన్…..!

వ్యభిచార గృహం నడుపుతున్న ప్రముఖ హీరోయిన్…..!

బాలివుడ్ లో సంచలనాత్మక సినిమాల్లో నటించే ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్ తన అధ్బుత నటనతో ప్రేక్షకులను మైమరపిస్తుంది.ఆమె నటించిన డర్టీ పిక్చర్, కహాని సినిమాలు ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకున్నాయి.తాజాగా విద్యాబాలన్ మరో సంచలన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తన తాజా చిత్రం ‘బేగం జాన్’ లో ఆమె వ్యభిచార గృహ (బ్రోతల్) నిర్వాహకురాలి పాత్ర పోషిస్తున్నది.ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.ఇందులో బ్రోతల్ నిర్వాహకురాలి పాత్రలో లీనమైపోయిన ఆమె ఆహార్యం అదుర్స్ అన్పిస్తున్నది.సినిమాపై అంచనాలు పెంచుతున్నది.

బెంగాలీ దర్శకుడు శ్రీజిత్  ముఖర్జీ బాలివుడ్ లో ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. బెంగాలిలో ‘రాజ్ కహాని’పేరిట శ్రీ జిత్ రూపొందించిన ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు అందాయి.దేశ  విభజన సమయంలో భారత్-పాకిస్తాన్ సరిహద్దు రేఖ వద్ద ఉన్న బ్రోతల్ హౌస్ ను నిర్వహించే పాత్రలో విద్య కన్పించనుంది.ఈ సినిమాలో గౌహార్ ఖాన్, పల్లవీ శార్దా వంటి ప్రముఖ తారాగణం నటిస్తుంది.

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top