Entertainment

రివ్యూ : గౌతమిపుత్ర శాతకర్ణి

రివ్యూ : గౌతమిపుత్ర శాతకర్ణి….

టైటిల్ :గౌతపుత్ర శాతకర్ణి

బ్యానర్:హిస్టారికల్ మూవీ

నటినటులు:యువరత్న నందమూరి బాలకృష్ణ , శ్రేయ శరణ్, హేమమాలిని ,కబీర్ బేడి తదితరులు

సినిమాటోగ్రఫీ:జ్ఞానశేకర్

మ్యూజిక్: చిరంతన్ భటి

ఆర్ట్:భూపేష్ భూపతి

పాటలు:సిరివెన్నెల సీతారామ శాస్త్రి

డైలాగ్స్:సాయిమాదవ్ బుర్ర

ఫైట్స్: రామ్-లక్ష్మన్

సహనిర్మాత:కొమ్మినేని వెంకటేశ్వరరావు

సమర్పణ:బిబో శ్రీనివాస్

నిర్మాతలు:వై.రాజీవ్ రెడ్డి- జాగర్లమూడి సాయిబాబు

దర్శకత్వం: జాగర్లమూడి రాదాకృష్ణ (క్రిష్)

రన్ టైం: 2 గంటల 12 నిముషాలు

సెన్సార్ సర్టిఫికెట్:12 జనవరి , 2016

తెలుగుజాతి గర్వించదగ్గ నాటి తరం నటుడు , నటరత్న నందమూరి తారక రామారావు వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకడిగా నాలుగు దశాబ్దాల తెలుగు వెండితెరపై  హీరోగా మెరుపులు మెరిపిస్తున్నాడు.తాతమ్మకలతో ప్రారంభమైన బాలయ్య ప్రస్తానం అయన తాజా చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో 100 చిత్రానికి చేరువయింది. బాలయ్య వందో సినిమా అమరావతి రాజదానిని అఖండ భారతావనిని ఏకం చేసిన శాతవాహన యువరాజు గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. టాలివుడ్ లో గమ్యం – వేదం- కృష్ణం వందే జగద్గురుమ్ – కంచె సినిమాలతో విబిన్న చిత్రాల దర్శకుడిగా డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న క్రిష్ డైరెక్టర్ చేసిన ఈ హిస్టారికల్ మూవీ రిలీజ్ కు ముందే భారీ హైప్ తెచ్చుకుంది.ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శాతకర్ణి ప్రేక్షకుల భారీ అంచనాలు ఎలా అందుకుందో చూద్దాం.

కథ:

ప్రస్తుత నవ్యాంద్ర రాజధాని అమరావతిని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న శాతవాహన సామ్రాజ్య యువరాజు గౌతమీపుత్ర శాతకర్ణి(బాలకృష్ణ) అఖండ భారతావనిని ఒకేతాటి మీదికి తేవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ముందుగా కళ్యాణదుర్గం రాజును జయిస్తాడు. వరుసగా 29 యుద్ధాలు చేసి ఆ రాజ్యాలను జయించి….వారిని తన సామంతులుగా చేసుకుంటాడు.భారత దేశాన్ని గతంలో పాలించిన ఎందరో గొప్ప రాజులు అయిన చంద్ర గుప్తుడు, అశోకుడు చేయలేని పనిని శాతకర్ణి చేస్తాడు.

ఇక గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ టైం నుంచి భారత దేశంపై దాడులు చేస్తున్న యవనులు(గ్రీకులు) డేమిట్రియస్ ఆధ్వర్యంలో భరత్ మీద దండెత్తేందుకు ఎదురుచూస్తుంటారు.భారత్ ను హస్తగతం చేసుకునేందుకు డేమిట్రియస్ అద్వర్యంలో వచ్చిన గ్రీకులను చిత్తుచిత్తుగా ఓడించి భారత జాతి ఖ్యాతిని చివరకు దశదిశలా  శాతకర్ణి ఎలా వ్యాపింపజేసాడు? తన జీవత ప్రయాణంలో తల్లి గౌతమి (హేమమాలిని), భార్య వశిష్ట దేవి(శ్రియ), తన పిల్లలతో అతడు ఎదుర్కొన్న పరిస్తితులు ఎంటన్నదే ఈ సినిమా స్టోరీ.

విశ్లేషణ:

ఈ సినిమాలో క్రిష్ శాతకర్ణి ముందుగా భారత్ఏ  ను ఏకం చేసి, తర్వాత గ్రీకులను ఎలా ఎదుర్కొన్నాడన్న అంశాన్ని చెప్పాలనుకున్నాడు. సినిమా స్టార్టింగ్ కళ్యాణ్ దుర్గం మీద యుద్దంతో స్టార్ట్ అవుతుంది.ఆ తర్వాత మరో గట్టి రాజ్యమైన సౌరాష్ట్ర మీద దండెత్తడంతో రెండో యుద్ధం చేసి, ఇండియాను ఏకం చేస్తాడు.చివర్లో గ్రీకు యుద్ధం జరుగుతుంది. భారత్ ఏకం అవ్వడంతోపాటు మన దేశానికి విదేశీ రాజ్యాల నుండి ముప్పు తప్పుతుంది.ఇదే కతను తాను ఎలా అయితే అనుకున్నాడో తెరమీద అంతకు మించి ప్రెజెంట్ చేసాడు. ఎక్కడ కత ట్రాక్ తప్పకుండా ,అనవసర విశ్లేషణలకు పోకుండా సినిమాను విజయవంతంగా ముగించాడు.

శాతకర్ణి రాజుగా అతని ప్రస్థానం ఎలా ప్రారంభం అయింది అన్నదానికంటే కేవలం క్రిష్ దేశాన్ని అతడు ఏకం అంశం మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ చేసాడు. అతడి వ్యక్తిగత జీవితంలో తల్లికి- అతడికి మద్య వచ్చే సన్నివేశాలు చాలా తక్కువగా రాసుకున్నాడు.ఇక భార్యకు అతడికి మధ్య వచ్చే సన్నివేశాలు తక్కువే అయిన చాలా నీట్ గా ఉన్నాయి. బాలయ్య -శ్రేయ మధ్య ప్రేమ- అనురాగం- ఆప్యాయత – శృంగారం- ఆందోళన ఇలా అన్నిఅంశాలను ఆవిష్కరించాడు. ఇక రాజ సుయాగం చేసినపుడు బాలయ్య స్త్రీ గురించి చెప్పిన డైలాగులు వర్ణించలేం. యుద్ద భూమికి బాలయ్య తన చిన్న కుమారుడుని కూడా తీసుకెళ్ళి చేసే సాహసం బాగుంది.అక్కడ బాలయ్య కొడుకు పులోమావి నహపాలుది కళ్ళల్లోకి ఎలాంటి భయం లేకుండా చూసే సీన్ హైలెట్.చివరకు గ్రీకుల వార్ తర్వాత మన జాతి గొప్పతనం గురించిన ఓ మంచి సందేశంతో సినిమాను ముగించాడు.

నటీనటుల పెర్ఫామెన్స్:

బాలయ్య ఆరుపదుల వయసుకు దగ్గరవుతున్న కూడా శాతకర్ణి సినిమాలో శాతకర్ణిలో అతడి నటన చూస్తే బాలయ్యలో ఎనర్జీ రోజు రోజుకు పెరుగుతుందనిపించింది.శాతకర్ణిగా అతడి నటన తన తండ్రి ఎన్టీఆర్ పౌరాణిక సినిమాలను గుర్తు చేసింది. బాలయ్య యుద్ద సన్నివేశాల్లోనూ , డైలాగులు చెప్పడంలోను, ఇలాంటి సినిమాలు చేయడంలోనూమరోసారి తనకు తిరుగులేదు అనిపించుకున్నాడు.దానవీరసూరకర్ణ సినిమాలోఅభిమన్యుడిగా ఆ వయస్సులో ఎలా యుద్ధం చేసాడో…ఇప్పుడు ఈ వయస్సులో కూడా అదే ఎనర్జీ.ఇంకా చెప్పాలంటే అంతకు మించిన ఎనర్జీ తో యుద్ద సన్నివేశాల్లో నటించాడు .

ఇక బాలయ్య భార్యగా వశిష్ట దేవిగా శ్రియ, బాలయ్యకు తల్లిగా మహారాణి గౌతమిగా బాలివుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని సినిమాకు వన్నె తెచ్చారు. యుద్ద ధర్మ అనే దీటైన పాత్రలో హేమమాలిని నటిస్తే, యుద్ధం వద్దు భర్త శ్రేయస్సే ముఖ్యం అనుకునే రోల్ ల్లో శ్రేయ నటించింది.ఇక ఇద్దరుపిల్లలకు తల్లిగా, అటు మహారాజు భార్యగా శ్రేయ ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది.మిగిలిన నటుల్లో బాలయ్య రాజ్యంలో సైనిక సామ్రాజ్యంలో శివకృష్ణ, తనికెళ్ళ భరణి,దూతగా శుభలేక సుధాకర్ , ఇక గ్రీకు మనుషులుగా డేమిట్రియస్, ఎతినా రోల్ లో చేసిన వారిగా తమ పాత్రలకు బాగా సెట్ అయ్యారు. టిడిపీగా ఎమ్మెల్సీ యామినిబాల శ్రేయకు వార్నింగ్ ఇచ్చే సీన్ లో త్కుళుమన్నారు.

టెక్నికల్ డిపార్టమెంట్ ఎవలైజింగ్ :

ఈ సినిమాలో టెక్నికల్ విభాగాలన్ని కలిపి ఓకే గాటాన చెప్పడం సరికాదు.అంత అద్భుతంగా టెక్నికల్ విభాగం పనిచేశాయి.

సినిమాటోగ్రఫీ :

జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా ….ఏమని చెప్పుకున్నాతక్కువే….నటీనటులను అందంగా ,సీన్ కుతగ్గటుగా క్లోజప్ ,లాంగ్ షార్ట్ లలో చూపించడంలోను ,యుద్ధ సన్నివేశాలు, సాంగ్స్, నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయి తెరమీద చక్కగా ఆవిష్కృతం అవ్వడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు.

ఆర్ట్ :

భూపేష్ భూపతి ఆర్ట్ వర్క్స్ ను వర్ణించడానికి మాటలు చాలవు. శాతవాహన సామ్రాజ్యం ,కళలు ,శిల్పాలు ,ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి ఏమిటి సినిమాలో అన్ని సీన్లలోను ఒక వైపు సీన్లను చూస్తూనే మారొక వైపు ఆర్ట్ వర్క్స్ ను సైతం మిస్ కాకూడదనెంత అద్భుతంగా ఉన్నాయి. సాంగ్స్ ,సీన్లు, శాతకర్ణి జీవిత చరిత్రను వివరిస్తూ శివరాజ్ కుమార్ చేసే సాంగ్ లో ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్ట్ వర్క్స్ ను వర్ణించలేం.

మ్యూజిక్ :

చిరంతన్ భట్ మ్యూజిక్ మెస్మరైజ్ చేసింది. పాటలతో పాటు ఆర్ ఆర్ ప్రతీ సీన్ ను ఎలివేట్ చేసింది. సినిమాలో బాలయ్య డైలాగ్స్ చెప్పేటప్పుడు , యుద్ధ సన్నివేశాలు , శ్రీయ- బాలయ్య మధ్య వచ్చే సన్నివేశాల్లో సీన్లకు తగినట్టుగా ప్రేక్షకుడిని సినిమాలో ఇన్వాల్ చేయడంలో ఓ రేంజ్ లో విజ్రుభించారు. పాటల కంటే సీన్లు వార్ సన్నివేశాల్లో ఆర్ ఆర్ అదిరిపోయింది.

ఫైట్స్ :

శాతకర్ణి లో ఉన్న నాలుగు వార్ సన్నివేశాల్లో సినిమాకు హార్ట్ తొలి యుద్ధం – నహపాలుడు యుద్ధం- గ్రీకుల యుద్ధం అన్ని సినిమాకు అక్కడికో తీసుకెళ్ళాయి. నహపాలుడు తో సముద్రంలో చేసే యుద్ధం , నహపాలుడు కోటలోకి ఎంట్రీ ఇచ్చేందుకు బాలయ్య చేసే విన్యాసం , చివరలో గ్రీకులతో బ్లూ మ్యాట్ మీద చేసే భారీ యుద్ధం ఇలా ఈ యుద్ధాన్ని తీసుకున్నా మైండ్ బ్లోయిగ్ చేసేశాయి .రామ్-లక్ష్మణ్ లకు హాట్సాఫ్ .

డైలాగ్స్ :

శాతకర్ణి డైలాగ్స్ చెప్పాలంటే అద్భుతం- అత్యఅద్భుతo ఇంకా ఏమైనా ఉంటే అదే అనుకోవాలి.బుర్రా సాయి మాధవ్ రాసిన ప్రతీ డైలాగ్ తనలోని అత్యద్భుత ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి. వీటిని తెర మీద బాలయ్య చెప్పుతుంటే విజిల్ వేయని ప్రేక్షకుడు లేడు .

 • మనం కథలు చెప్పకూడదు….. మన కథలు జనం చెప్పుకోవాలి.
 • శరణం అంటే రక్ష …. రణం అంటే మరణ శిక్ష ఏది కావాలి.
 • ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాo….ఇక ఉనికిని చాటుదాం .
 • నేను ఒట్టు పెట్టింది నా భర్తకు కాదు…..ఓ చరిత్రకు
 • ఆడదాని కడుపులో నలిగి నలిగి వెలుగు చుసిన రక్తపు ముద్దవి
 • శాతకర్ణి ఒక్కడు మిగిలి ఉంటే చాలు…… మనలో ఒక్కడు కూడా మిగలదు.
 • నా రాజ్యంలో పాలించడానికి కాదు …..యచించడానికి కూడా అనుమతించను.
 • మమకారం …..అహoకారం రెండూ లేని వాడే నాయకుడు అవుతాడు.
 • మగనలికి గాజులు అందం….. మగాడికి గాయాలు అందo.
 • మారావు అనుకున్నా ….గెలిచినా రాజ్యాలు మార్చలేదు. …..వలచిన ఇల్లాలు మార్చలేదు.

ఇవి బుర్రా సాయిమాధవ్ ఆణిముత్యం లాంటి డైలాగులో కొన్ని ….. ఇంకా చెప్పాలి అంటే ఇంతకు మించిన డైలాగులు సినిమాలో చాలానే ఉన్నాయి.

మిగిలిన విభాగo లో ఎడిటింగ్ కూడా సినిమాలో ఏ సీన్ కట్ చేయడానికి ,తీసిపడేయడానికి విలులేనంత క్రిస్పిగా ఉంది.సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదంటే ఎడిటింగ్ గ్రిప్పింగ్ అర్ధం అవుతోంది.ఇంక ఫస్ట్ ఫ్రెమ్ ఎంటర్న్మేంట్ వై.రాజీవ్ రెడ్డి-  జాగర్లమూడి సాయిబాబా నిర్మాణ విలువలు ఎక్స్ లెంట్ . ప్రతి ఫ్రేమ్ లోను వారు పెట్టిన భారీ ఖర్చు కనపడింది.

క్రిష్ డైరెక్షన్ కట్స్:

ఇప్పుటి వరకు క్రిష్ తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు …. శాతకర్ణి మరో ఎత్తు .శాతకర్ణి క్రిష్ ను టాలీవుడ్ గ్రేటెస్ట్ దర్శకుల జాబితాలో టాప్ డైరెక్టర్ల లో ఒకటిగా నిలబెట్టడంతో పాటు ఈ సినిమా గతంలో తీసిన చారిత్రక సినిమా సరసన తెలుగు సినిమా చరిత్రలో చిరస్టాయిగా నిలిచిపోనుంది. శాతవాహన చక్రవర్తి తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో దానిని సూటిగా తక్కువ టైం(2.15గంటలు) లో అందరికి అర్ధమయ్యేలా చెప్పాలి. ఈ హిస్టారికల్ స్టొరీ లో కొంతవరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా కమర్షియల్ సక్సెస్ కోసం మెయిన్ ట్రాక్ తప్పకుండా సక్సస్ చేయడంలో క్రిష్ గొప్పతనం కనపడింది. కథ ,హైలెవల్ టేకింగ్,గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ,డైరెక్షన్ అన్ని తిరుగులేకుండా డీల్ చేశాడు.

ప్లస్ పాయింట్స్ :

 • బాలయ్య చేసిన విరోచిత యుద్ధ విన్యాసాలు ,డైలాగ్స్ ,నట విశ్వరూపం
 • స్టొరీ -స్క్రీన్ ప్లే – క్రిష్ మైండ్ బ్లోయింగ్ డైరెక్టన్
 • ఆర్ట్ వర్క్
 • యుద్ధ సన్నివేశాలు
 • మ్యూజిక్
 • నిర్మాణ విలువలు
 • సినిమాటోగ్రఫీ
 • ఎడిటింగ్ ….అన్ని సాంకేతిక విభాగాలు

మైనస్ పాయింట్స్(-):

-కొన్ని చోట్ల క్వాలిటీ తగ్గిన వజువల్స్

-శాతకర్ణిని కేవలం యుద్దకోణంలో చూపించడం

-కధను డామినేట్ చేసిన యుద్ద సన్నివేశాలు

ఫైనల్ గా…

-తెలుగు సినిమా చరిత్రలో చిరకాలం నిలిచిపోయే శాతకర్ణి

-తెలుగు దశదిశలా చాటి చెప్పిన శాతకర్ణి

-ప్రతి తెలుగు వాడు తప్పనిసరిగా చూడాల్సిన శాతకర్ణి

గౌతమీపుత్ర శాతకర్ణి యువసర్కిల్. కామ్ రేటింగ్ :3.8

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top