Entertainment

మహేష్ మూవీ పై బాహుబలి ఎఫెక్ట్……..!

మహేష్  మూవీ పై బాహుబలి ఎఫెక్ట్……..!

తమ ఫేవరేట్ హీరో సినిమా ముందు విడుదల కావాలని ప్రతి స్టార్ హీరో ఫ్యాన్స్ ఆశపడుతుంటే మూవీ  మేకర్స్ మాత్రం ఆచితూచి అలోచించి చాలా కేర్ ఫుల్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు .మరో పెద్ద సినిమాకు ,తమ మూవీకి కాంపిటీషన్ ఉండకూడదని ,ఎఫెక్ట్ తమ పిక్చర్ మీద పడకూడదని అనుకుంటున్నారు.ముందు అనుకున్న ప్రకారం రిలీజ్ చేయకుండా పోస్ట్ పోన్ చేసుకున్నారు.

తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్ లో ప్రస్తుతం మేకింగ్ లో ఉన్న మహేష్ బాబు సినిమా ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయ్యింది. షూటింగ్ చకచకా సాగుతోంది .మహేష్ బాబు ప్రిస్టేజియస్ గా భావిస్తున్న ఈ పిక్చర్ తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. ఈ వేసవి -అంటే ఏప్రిల్ ఎండింగ్ రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ అనుకోకుండా చిన్న ప్రాబ్లం వచ్చింది.

ఈ ఏప్రిల్ లోనే  రాజమౌళి బిగ్ మూవీ బాహుబలి 2 రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఇక్కడా ,ఓవర్సీస్ లో కూడా ఆ టైంలో తమ పిక్చర్ రిలీజ్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలీదు.కాబట్టి మహేష్ బాబు -మురుగదాస్  సినిమా రిలీజ్ రెండు నెలలు వాయిదా పడింది . సెంటిమెంట్ పరంగా మే నెల మహేష్ బాబుకు కలిసిరాదని ఒక టాక్ ఉంది.కాబట్టి ఈ సినిమాను జూన్ 23 న రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటున్నట్టు తెలిసింది.

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top