Entertainment

బుద్ధి లేక ఎన్టీఆర్ సినిమాలో చేశా……

బుద్ధి లేక ఎన్టీఆర్ సినిమాలో చేశా……

తేజ దర్శకత్వంలో హీరోలుగా ఎంతో మంది హీరోలు పరిచయం అయ్యారు. వారిలో ఒకరు నవదీప్. జై చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నవదీప్ కొన్ని సినిమాల వరకు సందడి కొనసాగించాడు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు రావడం గగనం అయ్యాయి. దాంతో చేసేది లేక నవదీప్ క్యారక్టర్ ఆర్టిస్టుగా ,విలన్ రోల్స్ చేస్తూ స్థిరపడి పోయారు. తాజాగా ఈయన ‘బ్రూస్లీ’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.ఆ సినిమాలో చాలా కీలకమైన రోల్ ను పోషించిన నవదీప్ అంతకు ముందు చేసిన ఒక సినిమాను బుద్ధి లేక చేశాను అని చెప్పుకొంటున్నాడు.

ఆ సినిమా మరేదో కాదు ‘బాద్ షా’. ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో నవదీప్ చెత్త పాత్ర పోషించాడు. సైడ్ విలన్ గా ఆ సినిమాలో నటించాడు. పైగా ఆ పాత్రకు ఏ మాత్రం ప్రాముఖ్యత ఉండదు.చాలా చీప్ గా ఆ పాత్రను అంతా చూశారు. అందుకే నవదీప్ ఆ పాత్రను బుద్ధి లేక చేశాను అని ఒప్పుకుంటున్నాడు. కథ చెప్పే సమయంలో ఆ పాత్ర చాలా బాగుంటుందని భావించాను. కానీ తీరా సినిమా విడుదలయ్యాక ఆ పాత్ర అసలు స్వరూపం నాకు తెలిసింది. అప్పుడు నేను ఏమిచేయలేకపోయాను అని నవదీప్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్  లో మంచి ఆఫర్స్ వస్తున్నాయని, అయితే ప్రతీది ఓకే చెప్పకుండా ఆచి తూచి వ్యవహరిస్తున్నాను అన్నాడు.

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top