Entertainment

పవన్ మాజీ భార్య సంచలన ట్వీట్

పవన్ మాజీ భార్య సంచలన ట్వీట్…..

పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.ప్రతి విషయం  గురించి ఆమె ట్విట్టర్ లో షేర్ చేసుకుంటూ ఉంటుంది.తాజాగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బెంగుళూరులో జరిగిన దారుణం గురించి స్పందించింది.ఆ సంఘటనపై పలు ట్వీట్ చేసింది.ప్రస్తుత వ్యవస్థపై విమర్శలు గుప్పించింది.చిన్న డ్రస్ లు వేసుకోవద్దని సూచిస్తున్న వారిపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.అలాగే సినీ ఇండస్ట్రీపై కూడా రేణు సంచలన ట్వీట్ చేసింది.

ట్విట్టర్ లో ఒక వ్యక్తి.. మొదట సినిమాల్లో ఆడవారిని హింసిస్తున్నట్లుగా చూపించడం మానివేయాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేసాడు. అయన ట్వీట్ కు సమాధానంగా అవును సినిమాల్లో ఆడవారిని వేదిస్తున్నట్లుగా చుపించవద్దని రేణు దేశాయ్ డిమాండ్ చేసింది. సినిమాను సినిమాగా చూడాలి తప్ప ఇలాంటివి చేయవద్దు, ఆలాంటివి చూపవద్దు అంటే ఎలా చెప్పండి. సినిమాల్లో ఆడవారిని హింసించినట్లుగా చూపితేనే వారికీ శిక్ష పడుతుందని, హీరో వారిని కొడతాడు అని తెలుస్తుంది. అలా  కాకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని కొందరు ఫిల్మ్ మేకర్స్ అంటున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ ట్వీట్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.  

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top