Entertainment

పవన్ కు థ్యాంక్స్ చెప్పిన రామ్ చరణ్

పవన్ కు థ్యాంక్స్ చెప్పిన రామ్ చరణ్ 

మెగాస్టార్ చిరంజీవి  నటించిన 15౦వ సినిమా ‘ఖైదీ నంబర్ 15౦’ జనవరి 11 ను నుండి థియేటర్లలో

సందడి చేసేందుకు రంగం సిద్దమైపోయింది. తారాస్థాయి అంచనాల మధ్యన విడుదలవుతున్న ఈ

సినిమా కోసం ప్రేక్షకులు , అభిమానులే కాకా సినీ పరిశ్రమ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది.

సినీ ప్రముకులంతా చిరంజీవి రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నామని చెబుతూ ఆయనకు శుభాకాంక్షలు

తెలుపుతూ వస్తున్నారు. చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఈ కోవలో నిన్న ఖైదీ నంబర్

15౦ మంచి విజయం సాధించాలని కోరిన విషయం తెలిసిందే.

నిజానికి నిన్న సాయంత్రం హాయ్ ల్యాండ్ లో జరిగిన ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవన్ హాజరు కావాల్సి ఉండగా,

కొన్ని అనుకోని కారణాల రీత్యా ఆయన హాజరు కాలేకపోయారు. అయినప్పటికీ ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని

పంపుతూ, శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ విషెస్ కు స్పందిస్తూ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ తెలిపారు.

పవన్ అభినందన తనకెప్పుడు స్పెషల్ అని ఈ సందర్బంగా రామ్ చరణ్ అన్నారు. ఇక ఖైదీ నంబర్ 15౦ విషయానికి

వస్తే , వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించారు.

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top