Entertainment

జై ….. లవ… కుశ…..?


జై ….. లవ… కుశ…..?

‘త్రిమూర్తులు’ ,’నట విశ్వరూపం’…..ఎన్టీఆర్ తాజా చిత్రానికి ఈ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయా? అంటే… ఫిల్మ్ నగర్ వర్గాల ప్రకారం అవుననే సమాధానం వినిపించింది.తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా అన్న కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు .ఇది క్లియర్ . కానీ , టైటిల్ విషయంలో మాత్రం నో క్లారిటీ . అందుకంటే,  పైన పేర్కొన్న రెండు టైటిల్స్ నీ కళ్యాణ్ రామ్ అనుకోలేదట.

ఈ నేపధ్యంలో మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది.ఈ మూడో టైటిల్ మాత్రం’ఫిక్స్’ అని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ,ఎన్టీఆర్ ఆర్ట్స్  పతాకంపై ఫిల్మ్ ఛాంబర్ లో’జై లవ కుశ’ అనే టైటిల్ ను కళ్యాణ్ రామ్ నమోదు చేయించారట.ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపత్రాభినయం చేయనున్నారనీ ,అందుకే జై , లవ , కుశ ,అనే పాత్రల పేర్లతో ‘జై లవకుశ’టైటిల్ పెట్టారన్నది టాక్. చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటిస్తేగానే టైటిల్ రూమర్లకు చెక్ పడేలా లేదు . త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది……. 

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top