Entertainment

ఎగరేసి నరుకుతానంటున్న బాలకృష్ణ

ఎగరేసి నరుకుతానంటున్న బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ… గౌతమీపుత్ర శాతకర్ణిగా ప్రేక్షకుల ముందకు

దూసుకొచేస్తున్నారు. ఈ నెల 12న శాతకర్ణి విడుదల సందర్భంగా ఈ చిత్రం కోసం

ప్రత్యేకంగా పతాక ఆవిష్కరణ ఉత్సవాన్ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు

రాష్ట్రాల్లో వంద థియేటర్లలో ఒకే సరి ఈ పతాకోత్సవాన్ని

నిర్వహించింది యూనిట్.

 

విశాఖపట్నంలోని జ్యోతి థియేటర్లో పతాక ఆవిష్కరణకు నందమూరి బాలకృష్ణ

హాజరయ్యారు. ఇది కేవలం పతాక ఆవిష్కరణ కాదని….శాతకర్ణి విజయానికి

నాంది అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు బాలయ్య. తన స్పీచ్ లో

భాగంగా…. మూవీలోని పలు డైలాగ్స్ చెప్పి అలరించారు బాలకృష్ణ. ‘ఇక్కడ

మా ఇంట్లో గదికి గోదాలుంటాయి…..గొడవులుంటాయి….ఇది మా ఇల్లంటూ

కొట్టుకుంటా… కానీ మధ్యలో ఇంకొకడు వచ్చి ఇది మా ఇల్లంటే ఎగరేసి నరుకుతాం…

సరిహద్దుల్లో శ్మశానం నిర్మిస్తాం.మీ మొండేలా మా జెండాని ఎగరేస్తాం’ అంటూ

బాలకృష్ణ ఆవేశంగా చెప్పిన డైలాగ్ కి ఆ ప్రాంగణం

అంతా దద్దరిల్లిపోయింది.

 

ఇలాంటి డైలాగులు ఇంకా ఎన్నో సినిమాలో ఉంటాయని… సినిమా అంతకంటే

అద్భుతంగా ఉంటుందని చెప్పిన బాలయ్య..’ మిత్రమా 12న చిత్రం విడుదల

కాబోతోందని’ అంటూ తన ప్రసంగానికి ముగింపు పలికారు.

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top