వేసవిలో సపోటా పండ్ల ఉపయోగాలు

మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉంటూనే ఉంటాయి. అయితే వీటిలో సపోటా పండు తెలిసిన వారు చాలా మంది ఉంటారు. దీనిని ఒక్కసారి రుచి చూస్తే ఇంక వదిలిపెట్టరు. అంత కమ్మని రుచిని సపోటా పండు కలిగి ఉంటుంది. అయితే ఈ పండు వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పండ్లలో సుక్రోజ్, ఫ్రక్టోజ్, చక్కెర శాతం సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల రోజులో ఒక పండును మనం తింటే కావలసిన శక్తి మనకు లభిస్తుంది. సపోటా పండు శరీరానికి యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అలాగే దీనిలో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. రక్తం తక్కువగా ఉన్నవారు అంటే రక్తహీనతతో భాధపడేవారు ఈ సపోటా పండ్లను తీసుకోవడం చాలా మంచిది. అలాగే సపోటాలో పీచు అధికంగా ఉంటుంది. దృష్టి లోపం ఉన్నవారు సపోటాలను ఎక్కువగా తీసుకుంటే చాలామంచిది. ఈ పండు ఊపిరితిత్తుల వ్యాధుల నుండి విడిపిస్తుంది. మొత్తం మీద శరీరానికి మంచి శక్తిని కూర్చుకోవాలి అంటే సపోటా తినాల్సిందే.

Comments are closed.