Uncategorized

వర్మ పై ఫైర్ అయిన మెగా ఫ్యాన్స్…….

మెగా స్టార్ చిరంజీవి  ప్రతిష్టాత్మక 150వ సినిమా ఖైదీ నెంబరు 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న (7-01-2017) న గుంటూరు దగ్గరలోని హాయ్ లాండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక ఎంత  అట్టహాసంగా జరిగిందో అంత  వివాదాలను తీసుకొచ్చింది. మెగా బ్రదర్ నాగబాబు సంచలన దర్శకుడు  వివాదాలకు కేంద్ర బిందువు రాం గోపాల్ వర్మ పై  తీవ్ర విమర్శలతో  విరుచుకు పడ్డాడు. ముంబై వెళ్ళిన తెలుగు దర్శకుడు తన పని తానూ చూసుకోవాలని అన్నయ్య చిరంజీవి ని విమర్శించే స్థాయి తనకు లేదని ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసాడు.

దీనిపై వర్మ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా దీటుగా స్పందించాడు. ఈ ఎపిసోడ్   పై మెగా ఫ్యాన్స్ వర్మ పై చాలా కోపంగా ఉన్నారు. మెగా కుటుంబంపై నాగబాబు పై వర్మ శృతిమించి ఆరోపణలు చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉండగా జనసేన అధ్యక్షుడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విషయంపై తాజాగా స్పందించారు.  వర్మ తన  సినిమాలు గురించి తానూ చూసుకోవాలని మెగా స్టార్ విమర్శించడం తగదని అన్నారు . మరి ఈ వివాదం ఎప్పటివరకు కొనసాగుతుందో ఎలా సమసిపోతుందో  విషయానికి కాలమే సమాధానం చెప్పాలి.  

Most Popular

Copyright © 2017 Yuvacircle.com Powered by Jaya Manoj

To Top