News

లండన్ లో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్న మగాడు……

లండన్ లో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్న మగాడు……

మనం చాలా సంవత్సరాల క్రితం చుసిన ‘జంబలకడిపంబ’ సినిమా గుర్తుందా…..? అందులో ఆడవాళ్ళు మగవాళ్ళలాగా , మగవాళ్ళు ఆడవాళ్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంతే కాదు ఆ సినిమాలో మగవాళ్ళకు కడుపులు కూడా వచ్చినట్టు చూపించారు.ఈ వివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాలో కథ లండన్ లో నిజం కాబోతోంది. సృష్టి దర్మం తిరగబడుతుంది.

అసలేం జరిగిందంటే లింగ మార్పిడితో పురుషుడిగా మారుతున్న 20ఏళ్ల హేడెన్ క్రాస్ ప్రస్తుతం 16 వారాల గర్భంతో ఉన్నాడు. ప్రసవంతో బ్రిటన్ లో బిడ్డకు జన్మనివ్వనున్న పురుషుడిగా రికార్డు సృష్టించనున్నాడు. పుట్టుకతో స్త్రీ అయిన హేడెన్ మూడు సంవత్సరాల నుండి చట్టబద్ధంగా మగాడిలానే జీవిస్తున్నాడు. పురుషునిగా మారేందుకు హార్మోన్ చికిత్స చేయించుకున్నాడు. భవిష్యత్తులో బిడ్డల్ని కనేందుకు తన అండాలను భద్రపరచాలని కోరగా దానికి 4 వేల పౌండ్లు ఖర్చు అవుతుందని, దానిని తాము భరించలేము అని ప్రభుత్వ ఆరోగ్య సంస్థ తిరస్కరించింది. దీంతో ఆతను ఫేస్ బుక్ ద్వారా వీర్య దాతను కనుక్కొని గర్భం దాల్చాడు. బిడ్డను కని తాను మంచి నాన్నను అవుతానని హేడెన్ అంటున్నాడు.

Most Popular

Copyright © 2017 Yuvacircle.com Powered by Jaya Manoj

To Top