• April 20, 2019

రాగులతో ఆరోగ్య ప్రయోజనాలు

పూర్వం మన తాతలు, తండ్రులు ఈ రాగులను చాలా విరివిగా ఉపయోగించేవారు. వీటితో రాగి సంగటి, జావ, అలాగే రాగి రొట్టెలు వంటివి వేసుకుని తినేవారు. ఈ రాగులు రక్తం పట్టడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ రాగులను పిండి చేసి ఆ పిండిని వారు ఆహారంగా తీసుకునేవారు. ఇప్పుడు వీటి గిరాకీ తగ్గింది కానీ ఆరోగ్య ప్రయోజనాలు అలాగే ఉన్నాయి. చాలామంది పెద్దవారు ఈ రాగిపిండిని జావ కాచుకుని తాగుతారు.

ఈ పిండి షుగర్, బిపి ని అదుపులో ఉంచడంలో ముందు ఉంటుంది. అందుకే వైద్యులు ఈ మద్య రాగిజావ తాగమని సూచిస్తున్నారు. అలాగే ఈ పిండి జావ లేదా మాల్ట్ ను రోజూ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. చిన్నపిల్లలకు ఇది మంచి ఆహారం. చిన్నప్పటి నుంచి వారికి ఈ రాగిజావ తాగించడం వల్ల శరీరం దృఢంగా, పుష్టిగా ఉంటుంది. కొన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి. అలాగే రాగిపిండిని తీసుకోవడం వల్ల శరీరంలో వృద్దాప్యఛాయలు తగ్గుతాయి. ఈ రాగిపిండికి ఉన్న మరొక పేరు “చోడిపిండి”.

admin

Read Previous

ఉల్లికాడల వల్ల ఆరోగ్యప్రయోజనాలు?

Read Next

తెలివి కోసం తిప్పలు