Uncategorized

మెగాస్టార్ 151వ సినిమాకు డిస్కషన్స్ షురూ….!

మెగాస్టార్ 151వ సినిమాకు డిస్కషన్స్ షురూ….!

మెగాస్టార్ చిరంజీవి  హీరోగా నటించిన 15౦వ సినిమా ‘ఖైదీ నంబర్ 15౦’ బాక్సాఫీసు వద్ద సందడి చేసేందుకు రంగం సిద్దమైపోయింది. జనవరి 11న తారస్థాయి అంచనాల మద్యన విడుదలవుతోన్న ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది .ఇక ఈ సినిమా విషయం అలా ఉంచితే , మెగాస్టార్ నటించబోయే తదుపరి సినిమాకు కూడా ఇప్పట్నుంచే రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చిరు తెలుగులోని పలు స్టార్ డైరెక్టర్స్ తో చర్చలు కొనసాగిస్తున్నారు.

సురేందర్ రెడ్డి , బోయపాటి శ్రీను లాంటి దర్శకులతో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నయట . అదేవిధంగా చిరు ఎంతో ఇష్టంగా చేయాలనుకున్న ఉయ్యాలవాడ నర్సింహ రెడ్డి స్క్రిప్ట్ కూడా ఆలోచనలో ఉందట. మరి ఈ ప్రాజెక్టుల్లో ఏది ఫైనలైజ్ అవుతుందన్నది తెలియాల్సి ఉంది.ఇక ఖైదీ విషయానికి వస్తే ,వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా , కాజల్  హీరోయిన్ గా నటించారు.

Most Popular

Copyright © 2017 Yuvacircle.com Powered by Jaya Manoj

To Top