• April 20, 2019

మజిలీ రివ్యూ రేటింగ్

“మజిలీ” సమీక్ష:

విడుదల తేదీ: ఏప్రిల్ 05, 2019

నటీనటులు: నాగ చైతన్య, సమంత, దివ్యాంక కౌషీక్, రావు రమేష్, మరియు పోసాని కృష్ణ మురలి తదితరులు.

దర్శకత్వం: శివ నిర్వాణ.

నిర్మాణం: సాహు గారపాటి, హరీష్ పెద్ది.

సంగీతం: గోపి సుందర్, తమన్.

అక్కినేని నటవారసులలో అక్కినేని నాగ చైతన్య ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.  మాస్ యాక్షన్ జనర్లో తెరకెక్కించిన కినేమళాన్ని వరుసగా ఫ్లాప్ కావడంతో మరోసారి తనకు మంచి పట్టున్న రొమాంటిక్ డ్రామానే ఎంచుకున్నాడు. తన నిజ జీవిత సహచరిణితో కలిసి తెర జీవితంలో మరో విజయాన్ని సొంతంచేసుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ప్రయత్నంలో పెళ్లి తరువాత నాగ చైతన్య , సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం  ‘మజిలీ’ ఒక ప్రత్యేక విశేషం కావడంతో భారీ అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా మంచి పేరు సంపాదిచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ, సమంత జంటగా ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ‘మజిలీ’ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకోగలిందో సమీక్షిద్దాం.

కధ:

పూర్ణ ( చైతు) ఎటువంటి బాధ్యతలు లేనివిధంగా తాగుతూ… ప్రేమించిన అమ్మాయినే తలంచుకుంటూ కాలం గడుపుతూ తిరుగుతూ ఉంటాడు. అయితే ఇలాంటి వ్యక్తి జీవితంలోకి భార్తే ప్రాణంగా  ప్రేమించే శ్రావణి ( సమంత) వస్తోంది. పూర్ణ ఎలా ఉన్నా ఏమి చేసినా గుడ్డిగా భర్తకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వాళ్ళ జీవితంలోకి మీరా అనే పాప వస్తోంది.  ఆ తరువాత ఆ పాప కారణంగా వాళ్ళ జీవితాలు ఎలా మారాయి, డిప్రెషన్లో ఉన్న పూర్ణ ఎలా మారాడు? శ్రావణి అంటే ఎలాంటి ఫీలింగ్ లేని పూర్ణ ఆమెను భార్యగా ఎలా చూశాడు? ఈ క్రమంలో వీరిద్దరి మధ్య బంధం ఎలా కొనసాగింధి?అసలు అలా మారడానికి గల అమ్మాయి ఎవరు? వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు? పూర్ణ చివరికి మారాడా ?లేదా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ మజిలీ సినిమాని వెండి తెరపై చూడాల్సిందే.

తీర్పు: శివ నిర్వాణ మరోసారి ఎమోషనల్ డ్రమాద్వారానే ఎటువంటి హంగులకు పోకుండా నిన్నుకోరి చిత్రం తరహాలోనే ప్రేక్షకులను కట్టి పడేయడంలో దర్శకుడు మరోసారి విజయం సాధించాడు. చిత్రం మొదటి భాగంలో చైతు, దివ్యాంశుల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, చైతు స్నేహితులతో కలిసి చేసే అల్లరితో సరదాగా కధను నడిపిన దర్శకుడు, చిత్రం రెండో భాగంలో మాత్రం అంతా ఎమోషనగా నడిపి ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నం చేశాడు. అయితే అక్కడక్కడ కధ కొద్దిగా నెమ్మదించటం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగినట్టు అనిపిస్తుంది. తమన్ నేపధ్య సంగీతంతో సీన్స్ ను మరోస్థాయికి తీసుకువెళ్లాడు. సినిమాటోగ్రాఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి  తగ్గట్టు ఉన్నాయి.

admin

Read Previous

స్త్రీలలో ఆ సమస్యకు బెల్లం పరిష్కారం