Uncategorized

ఫిబ్రవరిలో లారెస్స్ శివలింగా……

ఫిబ్రవరిలో లారెస్స్ శివలింగా……

కొరియోగ్రాఫ్ గా మంచి ఫాంలో ఉనండగానే దర్శకుడిగా మరి తరువాత హీరోగానూ వరుస సక్సెస్ లు సాధిస్తున్న నటుడు లారెస్స్ .ముని సిరీస్ తో సూపర్ హిట్ లు సాధించిన లారెస్స్ మరో హర్రర్ మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.అయితే గత చిత్రాలను తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ డాన్సింగ్  స్టార్ కొత్త సినిమాను ఓ సినీయర్ దర్శకుడితో చేస్తున్నాడు.

కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన శివలింగా సినిమాను అదే పేరుతో తెలుగు,తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న లారెస్స్ . ఈ సినిమాకు ఒరిజినల్ వర్షన్ ను డైరెక్ట్ చేసిన పి.వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి లో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి  సినిమాను చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Most Popular

Copyright © 2017 Yuvacircle.com Powered by Jaya Manoj

To Top