పైనాపిల్ తినడంతో అనారోగ్యాలకు చెక్!

సహజంగానే పండ్లు తీసుకోవడం వల్ల అనారోగ్యానికి దూరంగా ఉండవచ్చు. ఒక్కో పండు ఒక్కో రకమైన పోషకాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా పైనాపిల్ తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు అని నిపుణులు చెప్తున్నారు.

  • పైనాపిల్ ను తీసుకోవడం వల్ల దానిలోని విటమిన్ సి మన శరీరానికి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ గా సహాయపడుతుంది.
  • వాయునాళాలకు సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో కఫాన్ని కూడా తగ్గిస్తుంది.
  • గాయాలు జరిగినప్పుడు నొప్పి, వాపు, మంట, మొదలగు సమస్యలు వున్నపుడు పైనాపిల్ తీసుకోవడం వల్ల దానిలో ఉన్న బ్రోమిలైన్  అనే ఎంజైమ్ వాటికీ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
  •  పైనాపిల్ లో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రక్తనాళాల్లో రక్తప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది.
  • ఈ పైనాపిల్  ఆర్థరైటిస్ లాంటి జబ్బుల వల్ల వచ్చే నొప్పి, మంటను కూడా తగ్గిస్తాయి.
  • ఇలాంటి కారణాల వల్ల నిపుణులు పైనాపిల్ తీసుకోవడం ముఖ్యం అని చెప్తారు.  

Comments are closed.