• April 20, 2019

తొలి ముద్దు

“సమయం తెల్లవారు జామున నాలుగు అయింది”.

“క్లింగ్…క్లింగ్” ఫోన్ మోగుతోంది.

“స్వాతి లే త్వరగా బయటకు వెళ్ళాలి”

“అబ్బా ఎక్కడికి తేజ”     

రా…..చెప్తాను.

“కారులో చాలా దూరం తీసుకువచ్చావ్ కాని ఎక్కడికి తీస్కెళ్తున్నావో చెప్పట్లేదు. అమ్మతో స్నేహితురాలి ఇంట్లో పూజ ఉంది అని చెప్పి వచ్చాను. అమ్మ అనుమానంగా చూసింది. త్వరగా వెళ్ళిపోవాలి

నువ్వేమో ఈ అడవి చుట్టూ చీకట్లో కారులో తిప్పుతూనే ఉన్నావ్ కానీ ఎందుకో చెప్పట్లేదు అంది స్వాతి.

“మనం ఒక్కరమే నిద్దరలేచామా. సృష్టి అంతా మనకంటే ముందు నిద్రలేచింది చూడు కావాలంటే. ఆ నీలాకాశం ఎంత బాగుందో చూడు” అన్నాడు తేజ.

“స్వాతి చూడు ఆ సన్ రైజింగ్”

“వావ్ సూపర్బ్” చాలా బాగుంది ఈ సన్ రైజింగ్. నన్ను ఇది చూపించడానికే ఇంత దూరం తీసుకొచ్చావా. తాంక్యు తేజ.

నీకు తెలుసా తేజ నేనెప్పుడు డ్రాయింగ్ కాంపిటిషన్ కి వెళ్ళినా ఈ బొమ్మ వేసేదాన్ని తెలుసా?!

“కాని ఇలా రియల్ గా చూస్తాను అనుకోలేదు”.

“నీకు ఇది చూపించాలి అనే తీసుకొచ్చాను స్వాతి” అన్నాడు తేజ.

ఇద్దరు కారు దిగి నడుస్తూ ఉన్నారు.

“స్వాతి జాగ్రత్త ముళ్ళు ఉంటాయి”

“ఓకే ఓకే చూసుకుంటున్నానులే బాబు, ఓవర్ యాక్షన్ చాలు” అంది స్వాతి.

“అబ్బ స్వాతి మీ అమ్మాయిలతో వచ్చింది ఇదే. మా అబ్బాయిలను ఏమి అనకుండా ఉండలేరు మీరు అసలా…”

“సర్లే మీరు అంతేగాని ఇలా కూర్చో నీతో మాట్లాడాలి”

“ఏంటి చెప్పు తేజ”

“ఈ రోజు నీకు గుర్తుందా స్వాతి”

“ఏంటి ఈరోజు స్పెషల్ తేజ”

“నేను నీకు ప్రొపోస్ చేసి ఈ రోజుకి రెండు సంవత్సరాలు అయింది తెలుసా?”

“ఓ….అవును కదా మర్చిపోయాను సారీ బుజ్జి”

“ఆ రోజు నాకు గుర్తుంది. ఒక్కోసారి గుర్తొచ్చినప్పుడు నవ్వుకుంటాను”

“సారీ వద్దు కాని ఈరోజు నాకు ఒకటి కావాలి ఇస్తావా చెప్పు”

“ఏంటి చెప్పు తేజ. ఇంటికి త్వరగా వెళ్ళాలి. ఫోన్ లో సిగ్నల్స్ లేవు అమ్మ ఫోన్ చేస్తే రింగ్ అవ్వదు కూడా”

“మనం వచ్చి పది నిముషాలయింది అప్పుడే వెళ్ళిపోదామా. పరవాలేదు మనకు నిశితార్ధం అయ్యింది స్వాతి. ఇంకో నెలలో పెళ్లి. ఇంకా దేనికి భయం కంగారు పడకు”

సరే నాకు కావాల్సింది ఏంటో చెప్తాను ఇస్తావ్ కదా

ఇస్తాను బాబు…..చెప్పు

“నాకు….నాకు….”

“ఆ….నీకు”

స్వాతి చేతులు నిమురుతూ “నాకు ముద్దు కావాలి” అని అడిగాడు తేజ.

“నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకోచ్చావ్ సన్ రైస్ చూడటానికే కదా. చూసాం కదా వెల్లిపోదాం రా” అంది స్వాతి లేస్తూ.

“ఏయ్..కూర్చో ప్లీజ్ స్వాతి. ఎప్పుడు నుంచో లవ్ చేసుకుంటున్నా౦, తొందరలో పెళ్లి కూడా చేసుకుంటున్నాం. ఇంకేంటి స్వాతి ప్లీజ్ స్వాతి ఇవ్వా” అని బ్రతిమలాడాడు తేజ.

“అన్ని పెళ్లి అయ్యాకే ఇస్తాను. సన్ రైజ్ చూడటానికి అనుకున్నా కాని నువ్వు ఇందుకు తీసుకువచ్చావా” అంది స్వాతి.

“సన్ రైజ్ మీ ఇంటి డాబా మీద నుంచి కూడా కనపడుతుంది” (బుంగమూతి పెట్టి)

“ప్లీజ్ స్వాతి మన లవ్ ఏనవర్సరి గిఫ్ట్ గా నాకు ఇవ్వా ప్లీజ్”

“నీ సంగతి నాకు తెలుసు నువ్వు ఇలాంటి ప్లాన్ వేస్తావ్ అని అనుకున్నాను. నీ పప్పులేమీ ఉడకవ్ అన్ని పెళ్లయ్యాకే”

“నా బంగారం కదా ఈ టూ ఇయర్స్ లో ఎప్పుడూ నిన్ను అడగలేదు ప్లీజ్ స్వాతి”

“అవును తేజ నువ్వు ఇందాక ఎందుకు అంత స్పీడ్ గా కార్ డ్రైవ్ చేసావ్ చెప్పు” అంది స్వాతి.

“నువ్వు టాపిక్ మార్చకు స్వాతి”

“కాదు తేజ అంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తే ఎలా చెప్పు?”

“అర్ధం అయ్యింది నీకు ముద్దివ్వడం ఇష్టం లేదు అంతేనా?”

“అది కాదు రా డ్రైవింగ్ అంత ఫాస్ట్ గా చేస్తే మనకే ప్రమాదం అని చెప్తున్నా”

“స్వాతి నీకు తెలుసు కదా నాకు రేసింగ్ అంటే ఇష్టం అని మళ్ళి ఎందుకు అడుగుతున్నావ్”

“అబ్బో అయ్యగారికి కోపం వచ్చింది”

“కోపం కాదు స్వాతి ఒక్క ముద్దివ్వే”

“ఆశ దోస అప్పడం వడ అలాంటివి ఏమి ఇవ్వడం కుదరదు”

“మీ అమ్మాయిలు పట్టు పడితే వదలరు. మేము అడుగుతూ బతిమలాడుతూ ఉన్న చెప్పరు మీరు ఇంక”

“వావ్ తేజ రామ చిలుక చూడు ఎంత బాగుందో”

“అవును దాని కన్నా దాని ముక్కు ఎర్రగా బాగుంది. రామ చిలుకలు ముద్దు పెట్టుకుంటాయి నువ్వు చూసావా ఎప్పుడయినా”

“తేజ నువ్వు ఆ టాపిక్ వదలవా”

“ఏంటి స్వాతి నువ్వు నేనేదో తప్పు అడిగినట్టు కోపపడుతున్నావ్. నువ్వు పాతకాలం అమ్మాయివి అని నాకు తెలుసు కాని మరీనా”

“తేజ నువ్వు ఇందాక కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడావ్ ఎందుకు చెప్పు”

“మళ్ళి టాపిక్ మారుస్తున్నావ్ స్వాతి”

“నేను టాపిక్ మార్చట్లేదు నిజమే మాట్లాడుతున్నాను. నువ్వు అలా డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే నాకు అంత భయం వేసిందో తెలుసా!”

“ఓకే ఓకే డార్లింగ్ ఐ యాం సారి ఇంకెప్పుడు అలా డ్రైవ్ చెయ్యను”

“ఇప్పుడు అలాగే అంటావ్ తరవాత నువ్వు మల్లి మామూలే”

స్వాతి ఎందుకు ఇన్ని డొంకతిరుగుడు మాటలు చెప్పు ముద్దివ్వడం ఇష్టం లేదు అని చెప్పచ్చు కదా.

“అది కాదు తేజ”

“ఏది కాదు”

“నిన్ను బాధపెట్టాలి అని కాదు”

మరి నేను నీకు కాబోయే మొగుడ్నే కదా. ఇంకో నెలలో పెళ్లి. అసలు మన ప్రేమ కోసం ఎన్ని భాదలు పడ్డాను. మీ వాళ్ళని పెళ్ళికి ఒప్పించేటప్పటికి న తల ప్రాణం తోకకి వచ్చింది. కనీసం అప్పుడు కూడా నేను ఒక ముద్దు నిన్ను అడగలేదు. ఇప్పుడు పెళ్లి దాకా వచ్చింది కాబట్టే కదా అడుగుతున్నాను.

“దేవుడా ఇంత ఎమోషనల్ బ్లాక్మెయిలా”

“నీకు నా భాద బ్లాక్మెయిల్ గా ఉంది. అంతేలే అలాగే అనుకో”

“బాబు చాలు నాయనా ఇస్తాను”

“ఏంటి!”

“ముద్దిస్తాను అంటున్నా”

“కోపంగా అయితే వద్దులే”

“కోపంగా కాదు ప్రేమగా ఇస్తాను”

“ఏంటి నువ్వే”

“ఓ గోల పెడుతున్నావ్ కదా ఇస్తానులే”

“అయితే త్వరగా పెట్టేయ్ మళ్ళి నీ మనసు మారిపోతుంది”

“తేజ…”

“మళ్ళి ఏంటి”

“ఆ అబ్బాయి ఎవరో మనల్నే చూస్తున్నాడు చూడు”

“వాడెవడో మేకల్ని కాసుకునేవాడు నువ్వు పెట్టు”

“ఆ లేదు వాడు వెళ్ళే వరకు నీకు ముద్దు లేదు”

“దేవుడా…సరే ఉండు అలా వెళ్ళమని చెప్తాను”

“హే తేజ నీ పక్కన మేక ఉంది అందుకేనేమో ఇటు చూస్తున్నాడు”

“సరే ఉండు వాడికే ఇచ్చేస్తాను”

“హే నాకు కావాలి ప్లీజ్ తేజ. ఈ మేక పిల్ల చాలా బాగుంది. నాకు కావాలి”

“ఇదెక్కడి గొడవ ఎవరైనా కుక్కల్ని పెంచుకుంటారు నువ్వెంటే మేక కావాలి అంటున్నావ్”

“హా….నాకు తెలీదు కావాలి”

“నా పని ఇలా ఉందేట్రా బాబు సరే అడిగి డబ్బులిచ్చి వస్తాను ఉండు”

“బేరం ఆడకుండా ఎంత అడిగితే అంత ఇవ్వు”

ఈ లోపు మేకలవాడు వెళ్ళిపోతాడు. సరేలే వాడు ఎక్కడికి వెళ్ళడు. అన్ని మేకల్ని లెక్కపెట్టి మళ్ళి ఇక్కడికే వస్తాడు అని చూస్తూ ఉన్నారు.

ఈలోపు మేకలవాడు వచ్చాడు.

“హే..బాబు ఆగు”

“అవును ఇది కొన్నాక అయినా ఇస్తావా”

“ఇస్తాను బాబు అయినా నాకు కూడా ఇవ్వాలి అనే ఉంది”

“ఏమి అమ్మాయిలురా బాబు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం బాగా అలవాటు మీకు”

“సరే గాని దీనికి ఏమి పేరు పెడదాం”

“నువ్వు ఏదో అనుకునే ఉంటావ్ కదా చెప్పు”

“టైగర్ అని పెడదాం”

“టైగర్ అని కుక్కకి పెడతారు దీనికి కాదు”

“మరి ఏమి పేరు పెడదాం”

“లూజ్ అని పెట్టు” బాగుంటుంది

“జోకులు వెయ్యకు నాకు కోపం వస్తుంది అది”

“అమ్మా బంగారం కోపపడకమ్మా నేను దించలేను”

“ఆ మేకల వాడు ఏటో వెళ్ళిపోతున్నాడు చూడు”

“అవును అదేంటి ఆ అబ్బాయి పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్నాడు. చెవుడా ఏంటి”

“కాదు ఆ అబ్బాయి మన కారు వైపు వెళ్తున్నాడు చూడు” అంది స్వాతి.

“అవును అదేంటి మన కార్ చుట్టూ అంతమంది ఉన్నారు.

“తేజ మన కార్ చెట్టుకి ఎప్పుడు గుద్దుకుంది”

“కీస్ తేవడం మర్చిపోయావ్ ఏమో ఎవరో కార్ దొంగిలించబోయి చెట్టుకి గుద్దేశారు” అంది స్వాతి.

“పద ఆ కార్ దొంగిలించిన వారు కార్ లోపల ఉన్నారేమో చూద్దా౦”

“ఏవండీ.. కొంచెం జరగండి ఏవండి. వీళ్ళకి కూడా చెవుడు అనుకుంటా”

“స్వాతి కార్ లో నువ్వు ఉన్నావ్ ఏంటి. నీ తలకి గాయం కూడా అయింది”

“తేజ నువ్వు డ్రైవర్ సీట్లో ఉన్నావ్ నీ తలలో రక్తం కారుతుంది”

“ఏమయింది మనకి”

“…….”

ఫోన్ ఇంకా ఆన్ లో ఉంది ఎవరో అటు వైపు నుంచి “హలో హలో” అంటున్నారు.

అధిక ప్రేమలో గాడ ప్రేమలో ఉన్న వీరు చనిపోయాము అన్న విషయం మర్చిపోయారు.

admin

Read Previous

ప్రేమా పిచ్చి ఒక్కటే

Read Next

చేతకాని వాడి కథ