చింతగింజల వల్ల ఆరోగ్యం!

చింతపండును మనం ప్రతిరోజూ అనేక వంటల్లో వాడుతూ ఉంటాం. అయితే ఈ చింతపండుతో పాటు చింత గింజలు కూడా ఆరోగ్యానికి మంచివి అని మీకు తెలుసా? ఈ చింతగింజలను తీసుకోవడం వల్ల మనలో వచ్చే కొన్ని రోగాలను తగ్గించుకోవచ్చు. వయసులో పెద్దవారు అనేక రకాల నొప్పులతో భాదపడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, అధిక బరువు వంటి వాటితో భాదపడుతూ ఉంటారు. అటువంటి నొప్పుల నుంచి బయట పడటానికి చింతగింజలు ఉపయోగపడతాయి. ఈ చింతగింజలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని చింతగింజలను తీసుకుని, వాటిలో పుచ్చులు లేకుండా చూసుకోవాలి. అలా తీసుకున్న గింజలను బాగా వేయించుకోవాలి. తరువాత కొన్ని నీళ్లను తీసుకుని వేపిన గింజలను అందులో వేసుకుని, రెండు రోజులపాటు నానపెట్టుకోవాలి. ప్రతి రోజు నీటిని మార్చుకోవాలి. ఇలా నానిన గింజలను పొత్తు తీసి వేరు చెయ్యాలి. తరువాత మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా తయారైన పొడిని రోజుకు రెండుసార్లు పాలు లేదా నీటితో, చక్కెర లేదా నెయ్యితో కలిపి తీసుకోవాలి.

ఇలా చేయడం వల్ల రెండు, మూడు నెలల్లో ఒక మంచి ఫలితం పొందవచ్చు. ఈ చింతగింజల పొడిని గాజు సీసాలో మాత్రమే నిల్వ చేసుకోవాలి. ఇది కీళ్ళ నొప్పులతో పాటు షుగర్, గొంతు సమస్యలకు కూడా పరిష్కారం చూపుతుంది.

Comments are closed.