గోoగూర తో ఆరోగ్యం!

ఆకుకూరలు తీసుకోవడం మన శరీరానికి ఎంతో అవసరం. ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మన పెద్దలు ఎక్కువగా కూరగాయలతో పాటు ఈ ఆకుకూరలనే ఎక్కువగా తీసుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో వీటి స్థాయి తగ్గిందనే చెప్పాలి.  కొత్తిమీర, కరివేపాకు ఏదో వాడుతున్నాం అన్న పేరుకి వాడుతున్నాం అంతే. అదికూడా కరివేపాకు అన్నం కంచం పక్కనే ఉంటుంది. కానీ మనకి లభించే ప్రతి ఆకుకూరల్లో ఒక్కో రకమైన ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా గోంగూర తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు. ఈ గోoగూరలో పీచుపదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించుటలో ఉపయోగపడుతుంది. అలాగే కొలస్ట్రాల్ నుంచి కూడా దూరం చేస్తుంది.

గోంగూరలోని విటమిన్ సి శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీనితో పాటు ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ గోంగూరలో ఉండడంతో క్యాన్సర్ వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. ఎముకల బలం లేని వారు ఈ గోంగూరను తీసుకుంటే చాలా మంచిది. ఈ గోంగూర ముఖ్యంగా కంటికి సంభందించిన వ్యాధులతో బాధ పడుతున్న వారు తీసుకోవడం ఉత్తమం. ఇది రక్తహీనతను కూడా తగ్గిస్తుంది.

గోంగూరలో వుండే పొటాషియం, మెగ్నీషియం గుండె మరియు మెదడు సంభందించిన వ్యాధుల నుంచి బయటకు తీసుకొస్తాయి. గోంగూరలో వుండే క్యాల్షియం, ఇనుము శరీరంలోని షుగర్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. తుమ్ములు, ఆయాసం, దగ్గుతో బాధపడే వారు గోంగూరను తీసుకోవడం మంచిది అని నిపుణులు కూడా తెలుపుతున్నారు.    

Comments are closed.