కళ్ళు మండడానికి కారణాలు

కళ్ళు అలసటకు లోనయితే సాధారణంగా కళ్ళు మంటలు వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితి ఎక్కువగా కంప్యూటర్ పని చేసేవారికి, చరవాణీలను ఎక్కువగా వాడేవారికి వస్తూ ఉంటుంది. సాధారణంగా కళ్ళకి విశ్రాంతి చాలా అవసరం. చాలామందికి ఎక్కువగా తలపోటు వస్తూ ఉంటుంది. అంటే వారి కళ్ళు అలసటకు లోనయ్యాయి అని అర్ధం. కొంతమందికి కంటి నుండి నీరు కారడం, విపరీతంగా కళ్ళు మండడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కంప్యూటర్ వర్క్ చేసేవారికి ఈ కళ్ళు మంటల సమస్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారు 2 గంటలకు ఒకసారి పని ఆపి కళ్ళకు విశ్రాంతి ఇవ్వాలి. ఫోన్స్ ఎక్కువ వాడేవారిలోను ఈ సమస్య కనపడుతుంది. అలాగే కళ్ళను కాసేపు మూసి ఉంచి వాటిపై తడిపిన దూదిని ఉంచితే కళ్ళు చల్లబడతాయి. అలాగే కొన్ని సార్లు కళ్ళకు రెండు చేతులను అడ్డం పెట్టి మోచేతులను బల్లమీద ఉంచితే కాసేపటికి కళ్ళు అలసట తగ్గుతుంది. అలాగే అవసరానికి మించి ఫోన్లను, కంప్యూటర్ లను వాడకుండా ఉంటే మరి మంచిది.

ఇక చివరిగా కళ్ళకు సంబందించిన ఐ డ్రాప్స్ ను వాడడం మంచిదే. అయితే డాక్టర్ల సలహా మేరకు వాటిని వాడాలి.

Comments are closed.