ఎండాకాలంలో చల్లచల్లని మజ్జిగ ఉపయోగాలు

ఎండాకాలం వచ్చేసింది. ఇంకా ఈ వేడికి తట్టుకోలేక జనాలు అనేక రకాల పానీయాల వెంట పడుతూ ఉంటారు. అలాగే ఈ ఎండల్లో ఎంతో మంది విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉంటారు. వారు ఈ ఎండల భాద తట్టుకోలేక ఎప్పుడు ఏ పానీయం తాగుదామా అని చూస్తూ ఉంటారు. అయితే ఇందులో భాగంగా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగిజావ, అలాగే మజ్జిగను తీసుకుంటూ ఉంటాం.

అయితే ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనకు బాగా మేలు చేసే మజ్జిగను గూర్చి మాట్లాడుకుందాం. మజ్జిగ యొక్క ఉపయోగాలు అనేకం. బాగా నీరసంగా ఉన్నవారికి కాస్త ఉప్పు మజ్జిగ ఇస్తే వారి ప్రాణం లేచి వస్తుంది. అంతటి శక్తి మజ్జిగలో ఉంటుంది. చల్లచల్లని పానీయాలు ఎన్ని తాగినా ఒక గ్లాస్ మజ్జిగ తాగితే వచ్చే శక్తే వేరు. ఈ మజ్జిగలో కాస్త నిమ్మరసం వేసి కలుపుకుని తాగితే నీరసం తగ్గుతుంది. అలాగే కడుపు కాస్త ఉబ్బరంగా ఉన్నట్టు ఉంటె మజ్జిగలో జీలకర్ర, పంచదార, ఇంగువ కలుపుకుని తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

 కొంతమంది రాత్రుళ్ళు నిద్ద్ర పట్టక ఇబ్బందిపడుతూ ఉంటారు. అటువంటి వారు ఒక ఉల్లిపాయను తీసుకుని పేస్టు చేసుకుని, ఆ పేస్టును మజ్జిగలో కలుపుకుని తాగితే గంట తరువాత ఫలితం కనిపిస్తుంది. ఇకపోతే చదువుకునే పిల్లలకు పైత్యం ఎక్కువగా ఉంటుంది. అందుకని మజ్జిగలో కాస్త పటికబెల్లం కలిపి ఇస్తే ఫలితం ఉంటుంది. ఒక మాములుగా కూడా ఈ ఎండల్లో మజ్జిగను సేవించడం ఆరోగ్యదాయకం.

Comments are closed.