ఉల్లితో జుట్టు పెరుగుదల

పూర్వం మన పెద్దల కాలంలో ఆడవాళ్ళ జుట్టు ఎంతో పొడవుగా, ఒత్తుగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అటువంటి జుట్టు ఎవరికీ ఉండట్లేదు. కొందరికి ఆరోగ్యపర సమస్యల వల్ల జుట్టు ఊడుతుంటే, కొందరు మాత్రం సరదాకి కూడా తలను కత్తిరించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఉన్న ఆరోగ్య పరిస్థితుల్లో జుట్టు ప్రతి ఒక్కరికి ఊడిపోతుంది. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. మనిషి ఆరోగ్యాంగా ఉన్నప్పుడే జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టుగా ఒత్తుగా పెరగాలి అంటే కెరాటిన్ కావాలి. ఇవి తక్కువయితే జుట్టు ఊడిపోతూ ఉంటుంది.

శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ఆరోగ్య పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటూ ఉంటాం. ఇందులో భాగంగానే జుట్టు కూడా ఊడిపోతుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలి అంటే ఉల్లిని వాడాల్సిందే. ఇది ఎంతో ఉపయోగకరం అని నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు. ఉల్లిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది కెరాటిన్ తయారవ్వడానికి ఉపయోగపడుతుంది. ఉల్లి వల్ల జుట్టు నల్లగా ఉంటుంది. చుండ్రు సమస్యలు ఉన్నవారు వారానికి రెండు సార్లు ఉల్లి రసం పెట్టుకుని తలస్నానం చేస్తే చుండ్రు నుంచి విడుదల పొందవచ్చు. ఒత్తయిన జుట్టు కావాలి అనుకునేవారు ఉల్లిని వాడితే పూర్తిస్థాయిలో ఫలితం ఉంటుంది. 

Comments are closed.