• April 20, 2019

ఉల్లికాడల వల్ల ఆరోగ్యప్రయోజనాలు?

ఉల్లిపాయ అందరికీ సుపరిచితమైన కూరగాయ. ఈ ఉల్లిపాయలో ఉండే గుణాలను వర్ణించడం కూడా కష్టం అనేనంతగా దీని వల్ల ఉపయోగాలు ఉన్నాయి. మన పెద్దలు ఈ ఉల్లిపాయ మీద సామెతలు కూడా చెప్పేశారు. “ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు” అని. ప్రతి కూరలో ఉల్లిపాయ పాత్ర తప్పనిసరి. ఈ ఉల్లిపాయ కూరలో లేకపోతే ఆ కూర రుచి ఉండదు అనడంలో సందేహం లేదు. మంచి వర్షాకాలంలో ఉల్లిపాయ పకోడీ వేసుకుని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ ఉల్లిపాయ గురించి పక్కనపెడితే, ఉల్లికాడలకు ప్రత్యేకత ఉందండోయ్….

ఉల్లికాడలు మొదటగా వ్యాధినిరోధక శక్తిని ఇస్తాయి. ఈ ఉల్లికాడల్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఉల్లికాడలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్త సరఫరా బాగా అవుతుంది.  దీనిలో ఉండే కెమోఫెరాల్ అనే ప్లవానాయిడ్ ఇందుకు పనిచేస్తుంది. అలాగే కాంతి చూపును మెరుగు పడటానికి కూడా ఉల్లికాడలు ఉపయోగపడతాయి.

ఉల్లికాడల్లో పీచుపధార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇకపోతే జలుబు, జ్వరం వంటి రోగాలను ఈ ఉల్లికాడలు దూరం చేస్తాయి. అంతేకాకుండా వీటి వల్ల శరీరంలో కొవ్వు కూడా తగ్గుముఖం పడుతుంది. ఉల్లికాడలు ఉల్లిపాయకు ఏ మాత్రం తీసిపోవు అని ఇప్పుడు తెలిసిందా?

admin

Read Next

రాగులతో ఆరోగ్య ప్రయోజనాలు