ఉదయాన్నే అల్పాహారం మానేస్తున్నారా జాగ్రత్త

ఉదయాన్నే టిఫిన్ చేయడం అవసరమా అని భావించేవారు ఉంటారు. కొంతమంది మని ఒత్తిడిలో పడి ఉదయకాల అల్పాహారాన్ని మానేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు ఈ పద్దతిలో ఉంటారు. ఇంటిపని, వంటపని అంటూ టిఫిన్ మానేస్తారు. సరాసరి మధ్యాహ్నం భోజనం చేసేస్తారు. కానీ ఉదయం అల్పాహారం అనేది చాలా అవసరం. ఈ అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీనికి ఫలితంగా గుండెజబ్బులు, ఆయాసం వంటి రోగాలు తలెత్తుతాయి.

అలాగే ఉదయం టిఫిన్ చేయకపోవడం వల్ల మెదడు చురుకుదనం తగ్గిపోతుంది. దీనివల్ల బద్ధకం, నీరసం వస్తుంది. ఆలాగే షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉదయం టిఫిన్ చేయకపోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉదయం టిఫిన్ చేయడం చాలా మంచిది.

Comments are closed.